మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పుర్ జిల్లాలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి 17 తుపాకులను దోచుకెళ్లారు. నవ్ రా అటవీ ప్రాంతంలోని బక్డి పోస్ట్ లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 15 నుంచి 20 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ అటవీ భూముల ఆక్రమణలు, అనధికారికంగా చెట్ల నరికివేత అరికట్టేందుకు అటవీ శాఖ బృందాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాయి.