ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు అమిత్ అరోరాను సీబీఐ కోర్టు 7 రోజుల కస్టడీకి పంపింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ని అరెస్ట్ చేసిన ఈడీ.. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. మద్యం కుంభకోణంలో అమిత్ రూ.2.50 కోట్లు లంచం వసూలు చేసినట్లు సమాచారం. అయితే కోర్టు వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.