వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని అనుమానించి సహజీవనం చేస్తున్న ప్రేయసిని దారుణంగా చంపేశాడు ఓ యువకుడు. ఈ ఘటన బెంగళూరులోని రామ్మూర్తినగరలో చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన కృష్ణకుమారి, సంతోష్ దాలి మూడేళ్ల కిందట వేర్వేరుగా బెంగళూరుకు వచ్చారు. ఇదద్రూ బ్యూటీషియన్ వృత్తిలోనే పనిచేస్తుండటంతో రెండేళ్ల కిందట ఒకరికొకరు పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. ఈక్రమంలో కృష్ణకుమారి వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని మంగళవారం రాత్రి ఆమెతో గొడవపడ్డాడు. గొడవ హద్దుమీరటంతో ఆగ్రహంతో ఊగిపోయిన సంతోష్, ప్రేయసిని విపరీతంగా కొట్టి గొంతు నులిమాడు. ఆమె స్పృహ కోల్పోవటంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటితే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు.