శత్రు దేశాల డ్రోన్ల పనిపట్టేందుకు భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది.డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఈ విధమైన కార్యక్రమం ఆర్మీలో ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో సాగుతోన్న భారత్, అమెరికాల ఉమ్మడి సైనిక శిక్షణ కసరత్తులు ‘యుద్ధ్ అభ్యాస్’లో భాగంగా ఈ ట్రైనింగ్ ఫలితాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా.. తొలుత ఓ డ్రోన్‌ను గాల్లో ఎగురవేశారు. దాని శబ్దాన్ని గ్రహించిన ఓ ఆర్మీ శునకం.. సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే డ్రోన్లను వేటాడే శిక్షణ పొందిన ‘అర్జున్’ అనే గద్ద.. గాల్లోని ఆ డ్రోన్ ఆచూకీని పట్టేసి, దాన్ని కూల్చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa