సంజూ శాంసన్‌కు బదులు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రిషభ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంపై జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ తాజాగా స్పందించాడు. పంత్ విషయంలో తాము తీసుకొన్న నిర్ణయం సరైందేనని తెలిపాడు. గొప్పగా ఆడిన వ్యక్తికి కచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ విషయంలో సంజూ మరికొంత కాలం వేచి ఉండాలన్నాడు. ఒంటి చేత్తో గెలిపించే సత్తా పంత్‌కు ఉందని ధావన్ అభిప్రాయపడ్డాడు. శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడంటూనే అతను కొన్నిసార్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ధావన్ స్పష్టం చేశాడు. పంత్ టాలెంటెడ్ ప్లేయర్, మ్యాచ్ విన్నర్ అంటూ కితాబునిచ్చాడు.