భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ సూపర్ మార్కెట్ సిబ్బందితో గొడవపడి వార్తల్లో నిలిచింది. కర్ణాటకలోని విజయపురిలోని ఓ సూపర్ మార్కెట్ కు రాజేశ్వరి వెళ్లినప్పుడు సిబ్బందితో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆమె అక్కడినుండి వెళ్లిపోగా, తర్వాత ఆమెతో సంబంధం ఉన్న కొందరు సూపర్‌మార్కెట్‌లోకి చొరబడి సిబ్బందిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సూపర్ మార్కెట్ సిబ్బంది బయట పెట్టారు. అయితే, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. సిబ్బందితో రాజేశ్వరి గొడవ పడటానికి కారణం ఏమిటో తెలియరాలేదు.