ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బుధవారం పదవీ విరమణ చేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా మారిన సమీర్ శర్మ గురువారం కొత్త బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీఎస్‌గా పదవీ విరమణ చేసిన సమీర్ శర్మను చైర్మన్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సీఎస్‌గా పదవీ విరమణ చేసిన సమీర్ శర్మ.. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా, సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఈ రెండు పదవులు చేపట్టిన అనంతరం గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.