'ఇదేమి ఖర్మ.. రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న తెలుగుదేశం అధినేత మాజీ సీఎం చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో వాహనాలను పోలవరం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు వెళ్లకుండా టీడీపీ శ్రేణులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు వారిని తోసేసే అవకాశం ఉండడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉపయోగించే పెద్ద పెద్ద లారీలను తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టారు. చంద్రబాబు రాగానే రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. పోలీసులపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.