ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన సంకల్ప సిద్ధి కుంభకోణంలో వైసీపీ నేతల హస్తం ఉందన్న వార్తలపై తెలుగుదేశం నేత వల్లభనేని వంశీమోహన్ గురువారం స్పందించారు. దీనిపై చర్చించేందుకు ఆయన గురువారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు గానీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలికి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు రుజువైతే... ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు.