హత్యాయత్నం కేసులో యూపీ బీజేపీ మాజీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తొమ్మిదేళ్ల క్రితం విద్యార్థి నాయకుడు సుధీర్ ఓజాపై హత్యాయత్నం కేసులో ఆనంద్ స్వరూప్ సహా అతని నలుగురు అనుచరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి తిరస్కరించారు. ఈరోజు విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలను పాటించనందున నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.