ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో గని కుప్పకూలడంతో అందులో ఏడుగురు మృతి.సేకరించిన సమాచారం ప్రకారం, క్రేన్ సహాయంతో కార్మికుల మృతదేహాలను బయటకు తీయగా, శిథిలాల కింద మరింత మంది కార్మికులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.జిల్లా కేంద్రమైన జగదల్పూర్కు 12 కిలోమీటర్ల దూరంలోని నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్గావ్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.