ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని`అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో మధ్యాహ్న భోజనం కల్తీ అయింది. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన బాలికలందరూ అస్వస్థతకు గురయ్యారు. 40 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. వారందరినీ శింగనమల ప్రభుత్వాసుపత్రికి, 8 మందిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.