డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పార్టీ వ్యూహంపై కాంగ్రెస్ అగ్రనేతలు శనివారం చర్చలు జరపనున్నారు.నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం, సామాన్య ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులపై అధిక జీఎస్టీ రేట్లు వంటి సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ జైరాం రమేష్, లోక్‌సభలో ఆ పార్టీ చీఫ్ విప్ కె.సురేష్ శనివారం పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంట్లో సమావేశం కానున్నారు.