ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 09:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై ప్రముఖ సంస్థ డైనమాటిక్ టెక్నాలజీస్ ఆసక్తి కనబరిచింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్ ఉదయంత్ మల్హోత్రా నేతృత్వంలోని బృందం ఈ భేటీలో పాల్గొంది.ఈ సందర్భంగా ఏవియేషన్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో తమ సంస్థ కార్యకలాపాలు, అనుభవాన్ని వివరిస్తూ ప్రతినిధులు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా రక్షణ రంగంలో తమకున్న నైపుణ్యాన్ని వారు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను, విధానాలను వారికి తెలిపారు.ఈ సమావేశంలో డైనమాటిక్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పి. చలపతి, డైరెక్టర్ అహిల్యా మల్హోత్రా, సీఈఓ ఆండ్రియా మిలానీ, యూరప్ కార్యకలాపాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టినా లిడేగార్డ్ పాల్గొన్నారు. ప్రభుత్వ పక్షాన పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa