ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్వాడీ కార్యకర్తలకు బీమా సౌకర్యాలు.. 2 లక్షల ఇన్సూరెన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 06:03 PM

అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉపయోగపడేలా ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను రాష్ట్రంలోని అంగన్వాడీలకు వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో అంగన్వాడీ కార్యకర్తలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చెప్తున్నారు.


ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన


మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం వాటిల్లితే ప్రమాద బీమా చెల్లించేలా ఈ పథకం తీసుకువచ్చారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారికి ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన వర్తింపజేస్తున్నారు.


ఈ పథకం లబ్ధి పొందటం కోసం అంగన్వాడీ కార్యకర్తలు.. సంవత్సరానికి రూ.436 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినా, సహజ మరణం సంభవించినా కూడా ఈ పథకం కింద రూ.2 లక్షలను బాధిత కుటుంబానికి అందిస్తారు. అయితే 50 ఏళ్లు దాటిన వారికి ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన వర్తించదు.


ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన


మరోవైపు కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను కూడా ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలకు వర్తింపజేయనుంది. ఈ పథకం లబ్ది పొందటానికి ఏటా కేవలం 20 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకం కింద అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి వైకల్యం సంభవిస్తే బీమా డబ్బులు అందిస్తారు. ప్రమాదంలో పూర్తి స్థాయి వైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు, చనిపోతే రూ.2 లక్షలు అందిస్తారు. ప్రమాదం కారణంగా పాక్షిక వైఫల్యం సంభవిస్తే లక్ష రూపాయలు అందిస్తారు.


మరోవైపు ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి పలు సంస్కరణలు తెచ్చింది. అంగన్వాడీ కార్యకర్త గ్రాట్యుటీ పెంచటంతో పాటుగా విద్యా విధానంలో మార్పులు, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చుతున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య సంరక్షణ కిట్లు అందిస్తోంది. చిన్నారులు, గర్భిణులకు కావాల్సిన మందులు, ప్రథమ చికిత్సకు అవసరమైనవి ఈ కిట్లలో ఉంటాయి. అలాగే ఈ మందులను ఎలా ఉపయోగించాలనే దానిపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కూడా కల్పిస్తు్న్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa