ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎం వరాల జల్లు, రూ.6 కోట్లతో అభివృద్ది పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 06:05 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి పేరుతో ఉన్న నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామం రూపు రేఖలు మారుతున్నాయి. గతంలో ఇచ్చిన మాట మేరకు గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ పవన్ అభివృద్ధి చేస్తున్నారు. మాటలకే పరిమితం కాకుండా, తన ఇంటి పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని.. అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా కొణిదెల గ్రామస్థులు కొందరు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు పవన్ సానుకూలంగా స్పందించారు.


గతేడాది నందికొట్కూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన పవన్.. కొణిదెల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.50 లక్షల విరాళం అందించారు. జిల్లా అధికారుల సూచన మేరకు ఆ నిధులతో 90 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్‌హెడ్‌ నీటి ట్యాంకు నిర్మించారు. తాజాగా.. ఆ ట్యాంకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. చాలా ఏళ్లుగా గ్రామస్తులు నీటి సమస్యతో బాధపడతుండగా.. తాజాగా ఆ సమస్యకు చెక్ పడింది. ఇదే కాకుండా.. స్థానిక జిల్లా పరిషత్తు స్కూలు నుంచి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం వరకు దాదాపు 5 కి.మీ. మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోటు విడుదల చేశారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డు పునరుద్ధరణకు మరో రూ.45 లక్షలు మంజూరు చేయించారు.


కొణిదెల గ్రామానికి పల్లె పండుగ 1.0 పథకంలో భాగంగా రూ.20 లక్షలకు పైగా వెచ్చించి 3 అంతర్గత రోడ్లు నిర్మించారు. పల్లె పండుగ 2.0 పథకంలో మరో రూ.45 లక్షలతో చేపట్టిన 7 సీసీ రోడ్ల పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. కొణిదెల గ్రామస్థుల అభ్యర్థన మేరకు 4 గోకులాలు, గృహ నిర్మాణశాఖ సహకారంతో 19 ఇళ్లు, ప్రత్యేకంగా నీటితొట్టెలు నిర్మించారు. ఇక జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతుల కోసం 49 ఫీడర్‌ ఛానళ్లు అభివృద్ధి చేయటంతో పాటు రెండు చిన్న కాలువల పునరుద్ధరణ, 3 కమ్యూనిటీ చెక్‌డ్యాంలు సైతం బాగు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా పవన్ వరాలతో గ్రామం రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa