గుజరాత్లో ఏడోసారి గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు, ప్రధాని మోదీ మొదలు పార్టీ అగ్రనేతలు అక్కడ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. డిసెంబర్ 5 నుంచి గుజరాత్ మలి దశ పోలింగ్ జరగనుండగా.. అదే రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా బీజేపీ అగ్రనేతలు హాజరయ్యే ఈ సమావేశాల్లో రానున్న ఎన్నికల సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధతపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.