చాలా మంది గురక సమస్యతో తాము ఇబ్బంది పడడమే కాక పక్కన ఉన్న వారిని సైతం ఇబ్బంది పెడుతుంటారు. గురకతో బాధపడేవారిలో త్వరగా వయసు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అయితే అవసరమైతే అదనపు దిండ్లు వాడడం, ఒకవైపు నిద్రపోవడం, ఆవిరి పట్టడం, మద్యం సేవించడం, పొగతాగడం వంటి వాటికి దూరంగా ఉండడంతో గురక సమస్యను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.