ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న నటరాజన్ (25) చెన్నై తాంబరం రంగనాథపురంలో ఉండేవాడు. ఆ సమయంలో ముడిచూరు రోడ్డులోని ఓ బేకరిలో పని చేస్తోన్న అభినయతో పరిచయం ఏర్పడి ఆగస్ట్ 29న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 19న అభినయ హఠాత్తుగా అదృశ్యమైంది. ఇంట్లోని 17 తులాల బంగారం, రూ.20 వేల నగదు, పట్టు చీరలతో పరారైంది. నటరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం ఆమె ఇలాగే మరో ముగ్గురిని పెళ్లి పేరిట మోసం చేసినట్లు తేలింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.