రాజస్థాన్‌లోని సికార్‌లో శనివారం దారుణం జరిగింది. గ్యాంగ్‌స్టర్ రాజు తేథ్ను కిరాతకంగా చంపేశారు. సికార్‌లోని ఉద్యోగ్ నగర్ ప్రాంతంలో ఆయన నివాసానికి సమీపంలోని దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. ఆనంద్‌పాల్ గ్యాంగ్‌తో రాజు తేథ్ శత్రుత్వం ఉన్నట్లు సమాచారం. ఆనంద్‌పాల్ గ్యాంగ్-లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రాజు తేథ్ను తామే చంపినట్లు లారెన్స్ గ్యాంగ్ సభ్యుడైన హిస్టరీ షీటర్ రోహిత్ గోదార ప్రకటించాడు. ఆనంద్‌పాల్, బల్వీర్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలిపాడు. పట్టపగలే హత్య జరగడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.