ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. పాల ప్యాకెట్ కొనడానికి వెళ్లిన ఓ బాలికను దుకాణదారుడు అత్యాచారం చేశాడు. షామ్లి జిల్లాలో నివాసముండే 16ఏళ్ల బాలిక పాల ప్యాకెట్ కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. దుకాణంలోకి వెళ్లగా అక్కడే ఉన్న దుకాణదారుడు.. అమెను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు.. ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్లారు. షాపులో స్పృహ తప్పి పడిపోయిన బాలికను చూశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.