మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం రత్లాం జిల్లా వద్ద బస్టాప్‌లో నిలబడి ఉన్న జనాలను అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారని జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ తెలిపారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది.ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అభిషేక్ తివారీ తెలిపారు.