వివాదాస్పద చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ఇప్పటికే ప్రజలపై అనేక ఆంక్షలు పెట్టి వారిని హింసిస్తున్న కిమ్ మరోసారి అదే ధోరణి కొనసాగిస్తున్నారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై రుద్దుతున్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలకు బాంబ్, గన్, శాటిలైట్ పేర్లను పెట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే పెట్టిన పేర్లను కూడా మార్చాలని హుకూం జారీ చేశాడు కిమ్.