పుంగనూరులో జనసేన నేత రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన దాడిని మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి ఖండించారు. క్రింది స్థాయి నుంచి పైస్థాయి వరకు దాడులు చేయడమే వైసీపీ ధ్యేయంగా కొనసాగుతోందని ఆరోపించారు. రైతు సమస్యలపై తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుపడి నిర్వీర్యం చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని చెప్పి.. ఇప్పుడుండే జాబ్‌ను తీసేస్తుంటే ఏమిటి అర్థం అని అడిగారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుస్తులను తొలగించడం దారుణం అన్నారు.