ఏపీలో 1,458 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల నియమానికి డీఎంఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 45 ఏళ్ల లోపు ఉండాలి. ఏపీ స్థానికత కలిగి ఉండాలి. పీజీ/డెంటల్ డిగ్రీ చదివి ఏపీ మెడికల్/డెంటల్ కాన్సిల్ లో రిజిస్ట్రార్ వైద్యులు అర్హులు. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు. వేతనం సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్ కు రూ.85 వేలు, స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్ కు రూ.70 వేలు, సీనియర్ రెసిడెంట్(పీజీ) కు రూ.65 వేలు చెల్లిస్తారు. వెబ్ సైట్: https://dme.ap.nic.in/