చేతబడి చేసిందన్న అనుమానంతో భార్యపై భర్త రోకలిబండతో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈనెల 1వతేదీన పల్నాడు జిల్లా, దుగ్గిరాల మండల, రేవేంద్రపాడుకు చెందిన కొప్పోలు ఎస్తేరు రాణి, తనకు చేతబడి చేయించిందన్న అనుమానంతో భర్త రోకలితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను గుంటూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేయగా, మంగళగిరి రూరల్ సీఐ నాగభూషణం దర్యాప్తు చేస్తున్నారు.