ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా, వినుకొండ రూరల్ సీఐ ఎస్.రమేష్‌బాబు తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.... ఈపూరు మండలం అంగలూరు గ్రామానికి చెందిన చిట్టేటి శ్రీహరి చెడువ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ద్విచక్రవాహనాలు చోరీ చేసి పిడుగురాళ్ళలో విక్రయిస్తూ జల్సాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు శ్రీహరిపై 8 కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. అతనిపై సస్పెక్టెడ్ షీట్ తెరవనున్నట్లు చెప్పారు.