కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని టిడిపి ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, టిడిపి కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు జమ్మలమడుగు పాత బస్టాండ్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయ ఏఓ ఇక్బాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ వైయస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి, వారి ఆత్మగౌరవం వంటి వాటిల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. 34 వేలకోట్ల రూపాయల బీసీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి నాశనం చేస్తున్నారని తెలిపారు. బీసీ కులాలకు అధికారం, ఆర్థికంగా అభివృద్ధి
లేని పదవులను ఇచ్చి. నిధులు, రాజకీయ పెత్తనం చేసే పదవులను ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.