బీ.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని పురష్కరించుకొని ఆన్ని పలువురు నివాళి ఆర్పించారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా పాణ్యం లో ఎంపీడీవో ఆఫీస్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ గారని, రాజ్యాంగ నిర్మాతగా ప్రజలందరికీ సమన్యాయం చేసిన మహోన్నత వ్యక్తి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా డీఈవో అనురాధ, పాణ్యం ఎస్సై సుధాకర్ రెడ్డి, పాణ్యం ఎంఈఓ కోటయ్య, విద్యార్థి యువజన సంఘాలు ప్రజాసంఘాల నాయకులు పెరుగు శివకృష్ణ , వనం వెంకటాద్రి, భాస్కర్, దేవ దత్తు, బత్తినప్రతాప్, రియాజ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దినేష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ వీరేష్, టీచర్ గోవిందు, సిఆర్పి హరి, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చిరు , నాగరాజు, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa