తూర్పు గోదావరి , ప్రత్తిపాడు మండలంలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో ఉన్న ప్రైసీ డిజిటల్ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.6లక్షల ఆస్తినష్టం జరిగింది. పాలిక ఆంజనేయస్వామికి చెందిన ఈ షాపులో మంగళవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో మంటలు వ్యాపించి విలువైన కెమెరాలు, జిరాక్స్ మిషన్లు, 3 కంప్యూటర్లు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. కరెంట్ షాక్ సర్క్యూట్ కారణంగా సంభవించింది. ఈ అగ్నిప్రమాదం విషయం తెలిసి ప్రత్తిపాడు అగ్నిమాపక ఇన్చార్జ్ ఎంజీ రత్నరాజు, కేఎ్సఎన్ మూర్తి, పి.రమేష్, ఎన్.సతీ్షలతో కూడి అగ్నిమాపక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.