రాష్ట్రంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాటకు, దేశంలో వెయ్యి రూపాయల నోటుకు, విలువ లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. ఏ ఎండకా గొడుగు పట్టే తమ్మినేనిని చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందన్నారు. జగన్‌రెడ్డి బీసీలను ఉద్ధరించినట్లు తమ్మినేని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీతారామ్ చెడ్డీలు వేసుకుని తిరిగే రోజుల్లోనే సామాజిక న్యాయానికి నాందీ పలికిన పార్టీ టీడీపీ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa