ఎన్నారై అకాడమీ సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఎన్నారై అకాడమీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ లో సోదాలు పూర్తయ్యాయని, ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే విచారణ జరిపినట్లు తెలిపింది. సొసైటీ సభ్యులు అకాడమీ నిధులతో సొంత భవనాలు నిర్మించుకున్నారని, కరోనా సమయంలో భారీగా అక్రమాలు చేసి ఆర్థికంగా లబ్ధిపొందారని తెలిపింది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లోనూ అక్రమాలు చేశారని, సొసైటీ అకౌంట్ కు వచ్చిన నిధులన్నీ మరో ఖాతాకు బదిలీ చేశారని, 53 ఆస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నాం అని తెలిపింది.