ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో జగన్ భేటీ కానున్నారు. 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. ఎమ్మెల్యేల పనితీరు, కిందిస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలకుల ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ సమావేశంలో పార్టీలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు.