బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ నపుంసకుడని తీవ్రంగా విమర్శించారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఆగ్రహించిన ఆయన ఈ మేరకు ఘాటుగా స్పందించారు. రెండు రోజుల క్రితం భాగల్బుర్ నీలం అనే మహిళ దారుణ హత్యపై కేంద్ర మంత్రి స్పందిస్తూ...‘బీహార్ ప్రభుత్వం, సీఎం నపుంసకత్వానికి బలైపోయారు. నేను ఇలా అనడానికి కారణం 2 రోజులుగా ప్రజలు హత్యకు గురవుతున్నారు. కానీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది.’ అని అన్నారు.