నేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ దూసుకెళుతోంది. ఇప్పటికే 150 పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అహ్మదాబాద్ మణినగర్ లో ముస్లిం సంఘం 151 కేజీల బూందీ లడ్డులను తయారీ చేసింది. బీజేపీ విజయాన్ని లడ్డులతో సెలబ్రేట్ చేసుకోనున్నారు. అంతే కాకుండా బీజేపీ విజయంతో గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.