దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 62,571 వద్ద ముగిసింది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,609 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (3.57%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.56%), టీసీఎస్ (0.90%), కోటక్ బ్యాంక్ (0.72%), నెస్లే ఇండియా (0.68%).
టాప్ లూజర్స్ : యాక్సిస్ బ్యాంక్ (-2.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.31%), ఎల్ అండ్ టి (-2.06%), ఐసిఐసిఐ బ్యాంక్ (-1.02%), ఇన్ఫోసిస్ (-0.93%).