మాండస్ తుఫాను క్రమంగా బలహీనపడి తుఫాన్‌గా కొనసాగుతోంది. ఈరోజు , రేపట్లో దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్ని తాకుతూ మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఆ తరువాత తుఫాను క్రమంగా బలహీన పడనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కొన్ని సార్లు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది