వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. న్యాయమూర్తులు ఎంఆర్ షా, ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలను ఎక్కవ సమయం వినాలనుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది. విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.