జగన్ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కుదురైంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యాన్‌పిక్ భూకేటాయింపుల్లో ఐఆర్‌ఎస్ అధికారి కె.వి. బ్రహ్మానందరెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. వ్యాన్‌పిక్ భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ దాఖలు చేసిన కేసును క్వాష్ చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో బ్రహ్మానందరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చిందని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ రవీంద్రభట్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.