శ్వాస తీసుకో పవన్ కల్యాణ్... ప్యాకేజీ వద్దు అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎత్తిపొడిచారు. ఇదిలావుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన బస్సు యాత్ర కోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనం రంగు మిలిటరీ వాహనాలను పోలి ఉందంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆక్షేపించారు. ఇది నిబంధనలకు విరుద్ధం అన్నారు. అందుకు పవన్ కల్యాణ్ కూడా స్పందించి పలు వ్యాఖ్యలు చేశారు. నన్ను శ్వాస అయినా తీసుకోనిస్తారా? లేదా? అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. శ్వాస తీసుకో పవన్ కల్యాణ్... ప్యాకేజీ వద్దు అంటూ ఎత్తిపొడిచారు. పవన్ బస్సుయాత్రం కోసం సిద్ధమైన వాహనం ఆలివ్ గ్రీన్ రంగులో ఉంది. సాధారణంగా సైనిక వాహనాలు ఈ రంగులో ఉంటాయి. సాధారణ ప్రజలు ఇలాంటి రంగులో వాహనాలను కలిగివుండడం నిబంధనలకు వ్యతిరేకమని మాజీ మంత్రి పేర్ని నాని నిన్న వ్యాఖ్యానించారు.