గుంతకల్లు పట్టణంలోని బీరప్ప కూడలిలో శుక్రవారం రాత్రి వాహ నాలు తనిఖీలు చేస్తుండగా కారులో 17 సంచులలో రూ. 85 విలువైన గుట్కా ఉత్పత్తులు స్వాధీనం చేసు కున్నట్లు రెండవ పట్టణ సిఐ గణేష్ తెలిపారు. రాత్రి వేళల్లో వాహనాలు తనిఖీల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుండి కారులోగుర్తు పట్టలేని విధంగా సంచులలో గుట్కా ఉత్పత్తు లు ఉంచుకుని వస్తుండగా సోదాలు చేసి గుట్కా ఉత్పత్తులు గుర్తించి పట్టుకున్నామన్నారు. ఐతే కారులో ఉన్న ముగ్గురిలో ఒకరు పరారు అయ్యడన్నారు. పట్టుబడిన కారును, గుట్కా ఉత్పత్తులు సీజ్ నిందితు లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుస్తామని సిఐ చెప్పారు.