ప్రొద్దుటూరు స్థానిక శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ తౌసీఫ్ అను విద్యార్థి మధుమేహం వ్యాధితో బాధపడుతున్న బాలుడికి మందుల ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి శుక్రవారం రూ. లక్ష ఆర్ధిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వార్డు కౌన్సిలర్ జిలాన్ బాష, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.