ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 01:01 PM

ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పిలుపునిచ్చారు. విజయవాడ  పరిధిలోని  అంబాపురం, పి. నైనవరం గ్రామాలలో ఇదేం ఖర్మం మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, 2024 ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యంరాజు, గొడ్డళ్ల చిన్నరామారావు, గ్రామ పార్టీ నేతలు సిద్దిల రాజా, చెప్పిడి రమేష్‌, ఎస్‌కె. నభి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com