ప్రకాశం జిల్లా, పొదిలి పట్టణంలో వైసీపీ నాయకులు యథేచ్ఛగా భూ ఆక్రమణ లకు పాల్పడుతూ.. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారని మార్కాపురం మాజీ శాసనసభ్యలు కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. శుక్రవారం విశ్వబ్రాహ్మణ ఆరామక్షేత్రంలో నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చి వేయడంపై అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీసీ నాయకుల అక్రమాలపై ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని కేవలం బీసీ కులానికి చెందిన ఆరామక్షేత్రంపై గురువారం రాత్రి కోర్టు కాపీ అందగానే, శుక్రవారం ఉదయం ఏడు గంటలకు నిర్మా ణాలు కూల్చేందుకు ఆఘమేఘాల మీద చర్యలకు ఉపక్రమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలో భాగమేనని మండిపడ్డారు.