కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన శ్రీకాంత్ (41), ప్రతీక్ష (35) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారికి కుమార్తె గమ్య (4), కుమారుడు దైవిక (2) సంతానం. కుమారుడిని అనంతపురంలో ఉంటున్న అమ్మమ్మ వద్ద వదిలిన దంపతులు, దైవ దర్శనానికి వెళ్లి కారులో శృంగేరికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారును ఉడిపి జిల్లా కార్కల ఠాణా పరిధిలో ఓ ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, ప్రతీక్షతో పాటు వారి కుమార్తె గమ్య అక్కడికక్కడే మృతి చెందారు.