ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీలలో సామర్లకోట లో జరిగిన 37 వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు జరిగిన ఎంపికలలో శ్రీ ప్రకాష్ విద్యార్థిని కర్రి తనూజ అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు విశాఖపట్నం జిల్లా తరుపున ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై , ఈ నెల 14 నుండి 18 వరకు బీహార్ రాష్ట్రంలో శరన్ జిల్లాలో హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో ఆడనున్నదని, గతంలో కూడా ఈ విద్యార్థిని బేస్ బాల్ నందు జాతీయ స్థాయి పోటీలలో ద్వితీయ స్థానం సాధించిందని, విద్యా సంస్థల సీనియర్ ప్రిన్సిపల్ ఎం వి వి ఎస్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన తనూజ ని విద్యా సంస్థల అధినేత సి హెచ్ వి కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సి హెచ్ విజయ్ ప్రకాష్, కోచ్ సురేష్, వ్యాయమ ఉపాధ్యాయులు బాలరాజు తదితరులు అభినందించారు.