పదవ తరగతి విధ్యార్ధులు వచ్చే ఏడాదిలో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచేందుకు శ్రద్ధ వహిస్తున్నారని ఏపి మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, పైడి ప్రవీణ అన్నారు. ఆదివారం పోలాకి మండలం ఈదులవలస మోడల్ స్కూల్లో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా తల్లితండ్రులు తమ పిల్లల చదువు, భోజన వసతులు, మంచినీరు తదితర విషయాలపై ప్రిన్సిపాల్ ప్రవీణను అడిగి తెలుసుకొని, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్, బొజ్జ జగన్నాధం, పాలక వర్గ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.