సారవకోట మండల కేంద్రమైన సారవకోట పోలీస్ స్టేషన్ ను కాశిబుగ్గ డిఎస్పి ఎం. శివరామరెడ్డి వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సిబ్బందికి పేరుపేరునా యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పచ్చదనము వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరామిరెడ్డితో పాటు సీఐ డి. రాము స్థానిక ఎస్. ఐ బి. లావణ్య పోలీస్ సిబ్బంది ఉన్నారు.