నంద్యాల జిల్లా, పాములపాడు మండలం లోని ఎర్రగూడూరు గ్రామ శివార్లలో ఎలుగు బంటి సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఆదివారం గ్రామ శివార్లలోని చిట్టడవి సమీపంలోని పంట పొలాల్లో తిరుగుతున్న ఎలుగుబంటిని చూసిన రైతులు, పశువుల కాపర్లు పరుగులు తీశారు. గతంలో పలుమార్లు సంచరించాయి. ఈ నెల 2న బానకచెర్ల క్రాస్ హెడ్రెగ్యులేగర్ వద్ద తెలుగుగంగ కాలువలో ఎలుగుబంటి మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు అటవీశాఖ అధికారులు వెల్లడించలేదు. మండలంలో బానుముక్కల, బానకచెర్ల, ఎర్రగూడూరు గ్రామ శివార్లకు సమీపంలో చిట్టడవి ఉండటంతో సమీప గ్రామా శివార్లలో వణ్యప్రాణులు సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు అటవీశాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.