కడప నగరంలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఆయా స్టేషన్ల పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజల భద్రత, భరోసా కల్పిస్తూ విజిబుల్ పోలీసింగ్, నేరపూరిత కార్యక్రమాలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో పోలీసులు ఉంటున్నారనే భరోసా ప్రజలకు కల్పించారు. ఇందులో భాగంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ పోలీసులు అణువణువునా క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించారు.